ఏపీలో అమరావతి రాజధాని కోసం రైతులు నిరంతర పోరాటం చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి తో పాటు విశాఖపట్నం, కర్నూలు కూడా క్యాపిటల్ అని తెలిపింది. అంతేకాకుండా పరిపాలన రాజధానికి విశాఖ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం విలువైన తమ భూములను ధారధత్తం చేశామని, ఇప్పుడు ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తే తమ గతేం గాని అని అక్కడి రైతులు ఆందోళన చెందారు. దీంతో అప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు.